
పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్
హుస్నాబాద్‌రూరల్: దేవేంద్రనగర్‌లో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేసి పది మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా దేవేంద్రనగర్‌లోని పశువుల పాకలో పేకాట అడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకోని వారి నుంచి రూ.43 వేల నగదు, 9 సెల్ ఫోన్స్, 9 బైక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
గజ్వేల్‌రూరల్: పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామశివారులో చోటు చేసుకుంది. ఐదుగురు వ్యక్తులతో పాటు వారి వద్దనుంచి 9,700 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు, ఫామ్‌హౌస్‌లు, ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో జూదం, ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలను ఎవరైనా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే టాస్క్‌ఫోర్స్ అధికారులకు (8712667445, 8712667446)కు సమాచారం అందించాలని సూచించారు.
రూ.43 వేల నగదు,
9 సెల్ ఫోన్లు, 9 బైక్స్ స్వాధీనం

పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్