
డీఎస్‌ఆర్ పద్ధతితో ప్రయోజనం
చిలప్‌చెడ్(నర్సాపూర్): డీఎస్‌ఆర్ పద్ధతిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయాధికారి రాజశేఖర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని చండూర్ గ్రామంలో పలువురు రైతులు సాగు చేస్తున్న డీఎస్‌ఆర్ పద్ధతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఓ రాజశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. సంప్రదాయంగా నాటే వరి పద్ధతి కంటే డైరెక్ట్ సీడెడ్ రైస్‌తో నీటి వినియోగం చాలా వరకు తగ్గుతుందన్నారు. నారు వేసే పద్ధతి ఉండకపోవడంతో, కూలీల శ్రమ తగ్గుతుంది. పైగా తక్కువ కాలంలో పంట చేతికి వస్తుంది. రసాయన ఎరువుల వినియోగం తక్కువగా ఉండడంతో నేల సారవంతమవుతుంది. ఈ పద్ధతి వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉంటుంది. గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ కృష్ణవేణి, రైతు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందాపూర్ గ్రామశివారులోని వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. వాటిలో నుంచి ఆయిల్, కాపర్ వైరు చోరీ చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మంగళవారం ఉదయం వ్యవసాయ పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు విషయం గమనించి ట్రాన్స్‌కో అధికారులకు ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసిన విషయం తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
వ్యవసాయాధికారి రాజశేఖర్‌గౌడ్