
బదిలీలు, పదోన్నతులు కల్పించాలి
టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి
మెదక్‌జోన్: ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులను కల్పించటంతో పాటు విద్యాశాఖలో ఇన్‌చార్జిల స్థానంలో రెగ్యులర్ డీఈఓ, ఎంఈఓలను నియమించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో రెగ్యులర్ ఉపన్యాసకుడు లేకపోవటంతో శిక్షణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నగదు రహిత వైద్య విధాన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.