
చేయూత.. ఉపాధి
● డిజిటల్ పద్ధతిలో నెలవారీగా చెల్లింపులు ● అవగాహన కల్పిస్తున్న అధికారులు ● వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న అతివలు
సంగారెడ్డి టౌన్: మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలు ప్రవేశపెడుతున్నాయి. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు వివిధ ఉపాధి అవకాశాలు లభించేలా బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు అందిస్తున్నారు. మహిళలకు కిరాణా దుకాణాలు, టెంట్ హౌస్, కోళ్ల పరిశ్రమ, డెయిరీ పామ్, వివిధ చిన్న తరహా వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని మహిళా సంఘాల ద్వారా లబ్ధి పొందుతూ జీవనోపాధి పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో సీ్త్రనిధి ద్వారా ఈ సంవత్సరంలో రూ.83 కోట్ల రుణాలు మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. జిల్లాలో 25 మండలాలు, 365 గ్రామ సంఘాల్లో 10,016 మంది సభ్యులకు సీ్త్ర నిధి బ్యాంకు ద్వారా రుణాలిచ్చారు. సీ్త్ర నిధి నుంచి రుణాలు పొంది స్వయం ఉపాధి పొందడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. సభ్యులు తీసుకున్న రుణాలకు ప్రతి నెల ఆన్‌లైన్‌లో నేరుగా చెల్లించే అవకాశం కల్పించడంతోపాటు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
మహిళలకు సీ్త్ర నిధి ద్వారా రూ.83 కోట్ల రుణాలు
మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
మహిళా సంఘంలోని సభ్యులకు సీ్త్ర నిధి ద్వారా రుణాలిస్తూ వ్యాపారాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నాం. తీసుకున్న డబ్బులను ప్రతి నెల ఆన్‌లైన్‌లో సకాలంలో చెల్లిస్తున్నారు. మహిళలకు మరింత అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. వంద శాతం రుణాలు అందజేశాం.
– శ్రీనాథ్, సీ్త్ర నిధి రీజినల్ మేనేజర్

చేయూత.. ఉపాధి