
ఆరేళ్లుగా బస్టాండ్ వద్ద ఏర్పాటు
సీఐటీయూ ఆధ్వర్యంలో చలివేంద్రం
దుబ్బాక: దుబ్బాక పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా అంబలి కేంద్రంతోపాటు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి గొడ్డు బర్ల భాస్కర్ ప్రత్యేక కృషితో మార్చిలో బస్టాండ్ వద్ద చలి వేంద్రంను ఏర్పాటు చేసి ప్రతి రోజూ వెయ్యిమందికి పైగా చల్లటి మినరల్ వాటర్ అందిస్తు దాహార్తి తీరుస్తున్నారు. ఆరేళ్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా భాస్కర్ సాక్షితో తెలిపారు. మండుటెండలో ఎక్కడో సుదూరప్రాంతాలకు చెందిన వారు ఈ చలివేంద్రంలో చల్లని నీరు తాగి దాహార్తి తీర్చుకోవడం చూస్తుంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది.

ఆరేళ్లుగా బస్టాండ్ వద్ద ఏర్పాటు