
రోజూ 300 నుంచి 350 లీటర్లు
దుబ్బాకలో సివిల్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం
దుబ్బాక: పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సివిల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతీయేటా వేసవికాలంలో చలి వేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నారు. ప్రతిరోజూ 300 నుంచి 350 లీటర్ల చల్లని మినరల్ వాటర్‌ను అందిస్తూ 1,000 నుంచి 1,200 మందికి నీటిని అందిస్తున్నామని సివిల్ క్లబ్ అధ్యక్షుడు ఎర్రగుంట ప్రసాద్ సాక్షికి తెలిపారు. తమ వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు అందిస్తున్నామన్నారు. తమ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సైతం దీనికి ప్రత్యేకంగా సహకరిస్తున్నారని తెలిపారు.

రోజూ 300 నుంచి 350 లీటర్లు