
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రులు
దుబ్బాక : కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యం అందించేలా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఆస్పత్రిని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతోపాటు పక్కనే ఉన్న రైతుల పొలాల్లోకి నీరు వెళ్తుండటాన్ని గమనించి నెల రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌ను త్వరలోనే వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రిలో ఆర్ధోపెడిక్ డాక్టర్‌తోపాటు చాలా ఖాళీలు ఉండటంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని, అలాగే పలు సమస్యలను సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్ కమిషనర్ దృష్టికి తేవడంతో వెంటనే స్పందించి త్వరలోనే భర్తీ చేస్తామని హామీనిచ్చారు. రోగులు ప్రైవేట్‌కు వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. డెలివరీల శాతం పెంచాలన్నారు. ఆస్పత్రి కార్పొరేట్‌కు దీటుగా ఉందని ప్రత్యేకంగా ప్రశంసించారు. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఆస్ప త్రి సమస్యలను వైద్యశాఖమంత్రి దామోదర్ రాజ నర్సింహ దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి సూచన మేరకు కమిషనర్ రావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ అన్నపూర్ణ పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్
దుబ్బాకలోని వంద పడకల ప్రభుత్వాస్పత్రి తనిఖీ