
మల్లన్న ఆలయంలో వేలం పాటలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న ఆలయంలో శుక్రవారం సెల్‌ఫోన్ భద్రపరుచుకునే లైసెన్సు హక్కు కోసం, సీసీ కెమెరాల నిర్వహణ, షాపింగ్ కాంప్లెక్స్‌లో తాత్యాలికంగా వ్యాపారం చేసుకునేందు, పాత ఇనుప సామగ్రి విక్రయించేందుకు సీల్ట్ టెండర్ కమ్ బహిరంగ వేలములు నిర్వహించారు. టీటీడీ షాపింగ్ కాంప్లెక్స్‌లో 2వ నంబర్ గల షాపునకు నెలకు ఒక్కింటికి రూ.7,400 హెచ్చుపాట పాడి పీ.నర్సింహులు దక్కించుకోగా, సెల్‌ఫోన్ భద్రపరుచుకునే లైసెన్స్ హక్కును అయినాపూర్‌కు చెందిన దండు రవి రూ.15,20,000 హెచ్చు పాట దక్కించుకున్నారు. ఆలయంలోని పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసేందుకు రాజు కిలో ఒక్కింటికి రూ.28 హెచ్చు పాటపాడి దక్కించుకోగా సీసీ కెమెరాల నిర్వహణ హక్కును రఘుపతి ఆలయ అధికారుల ఎస్టిమేట్ పై 4 శాతం తక్కువ కోడ్ చేసి హక్కును దక్కించుకున్నట్లు ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఉద్యోగులు ,టెండర్‌దారులు తదితరలు పాల్గొన్నారు.