రేపు జిల్లాకు సీఎం రాక | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాకు సీఎం రాక

Apr 22 2025 7:04 AM | Updated on Apr 22 2025 7:04 AM

రేపు జిల్లాకు సీఎం రాక

రేపు జిల్లాకు సీఎం రాక

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కూతురు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకురాలు తూర్పు జయారెడ్డి (కూచమ్మ), గుణచైతన్యరెడ్డిల నిశ్చితార్థం బుధవారం సంగారెడ్డి పట్టణంలోని జగ్గారెడ్డి నివాసం వద్ద జరగనుంది. ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జపాన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. అదేరోజు ఆయన ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి హజరు కానున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వం ఈ నిశ్చితార్థనికి హజరు కానున్నారు. అయితే రేవంత్‌రెడ్డి పర్యటన మంగళవారం అధికారికంగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖులు వచ్చే అవకాశాలు ఉండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

పరిశీలించిన ఎస్పీ

సీఎంతో పాటు, పలువురు మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎస్పీ పరితోష్‌పంకజ్‌ సోమవారం జగ్గారెడ్డి నివాస ప్రాంతాన్ని పరిశీలించారు. డీఎస్పీ సత్తయ్యగౌడ్‌, ఇతర పోలీసు అధికారులు కలిసి ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

జగ్గారెడ్డి కూతురు నిశ్చితార్థానికి

హజరుకానున్న రేవంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement