ఇంజనీర్ల ఇలాకా.. | - | Sakshi
Sakshi News home page

ఇంజనీర్ల ఇలాకా..

Apr 20 2025 7:55 AM | Updated on Apr 20 2025 7:55 AM

ఇంజనీ

ఇంజనీర్ల ఇలాకా..

40 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది వీరే..
● చదువుకోవడానికి8 కిలో మీటర్లు వెళ్లే యువత ● వలసలు వెళ్లి చదివించిన తల్లిదండ్రులు ● ఒకరిని చూసి మరొకరుఉద్యోగాల వైపు అడుగులు ● గతంలో బాహ్య ప్రపంచానికితెలియని తండా ● నేడు ఆదర్శంగా నిలిచిన కంగ్టిమండలంలో జమ్గి(బీ) సాధు తండా

సాధించాలనే పట్టుదలతో ..

మా ఇద్దరు కూతుళ్లు ఒకరు ఎంబీబీఎస్‌ పూర్తి చేయగా మరో అమ్మాయి ఎన్‌ఐటీ త్రిచిలో సీటు సాధించింది. తల్లి ఉపాధ్యాయురాలు. దీంతో ఇంటిల్లిపాది ఉద్యోగాలు పొంది ఆర్థిక స్థిరత్వం సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. మారుమూల తండానుంచి ఇంత పెద్ద ఉద్యోగంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాను.

కే. పండరి, హైదరాబాద్‌ జిల్లా మేనేజర్‌(టీజీఆర్‌ఈడీసీఓ)

పోటీతత్వంతో ఉన్నత చదువులు

ండాలో యువకులు ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తితో ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం అభినందనీయం. తల్లిదండ్రులు సైతం పిల్లల చదువుల కోసం ప్రోత్సహించడంతో మా తండావాసులు ఉన్నత స్థాయిలో నిలుస్తున్నారు.

– నారాయణ, ఏఈ ట్రాన్స్‌కో, నారాయణఖేడ్‌

వలసలు వెళ్లి చదివించారు

మా తల్లిదండ్రులు వలసలు వెళ్లి డబ్బు సంపాదించి మాకు మంచి చదువులు చదివించడంతో మా జీవితాలు మారాయి. మేము మా పిల్లలను సైతం ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తున్నాం. తండాలోని యువతలో పోటీతత్వం, పోరాట పటిమ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

– మోతీరాం,ఏఈ ట్రాన్స్‌కో, మనూరు

మంచి పేరు ప్రఖ్యాతలు గడించాం

సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఇరిగేషన్‌లో ఏఈగా ఇరవై ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాను. మా తండా నుంచి యువకులు, విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడి సాధిస్తుండటంతో మంచి ఖ్యాతి ఉంది. యువకులకు ఉన్నత చదువుల కోసం ప్రోత్సాహం అందిస్తున్నాం.

– కుషాల్‌, ఏఈ ఇరిగేషన్‌, నిజామాబాద్‌

వలసలు వెళ్తే గాని

పూట గడవదు

తండాలో 120 ఇల్లు, కుటుంబాలు 152 ఉంటాయి. ఇక్కడ ఉన్న భూములు కూడా సాగు నీటి వసతి లేని ఎర్ర చెలుక భూములే. ఏడాదిలో ఎనిమిది నెలలు చెరకు నరికేందుకు, ఇటుక బట్టీలకు వలసలు వెళ్తే తప్ప బతుకు బండి నడవదు. పిల్లలను బడికి పంపేకంటే కూలీకి పంపితేనే బాగుంటుందని భావించే దుస్థితి. అలాంటి దుర్భర పరిస్థితిలో నుంచి ఏక కాలంలో నలుగురు ఇంజనీర్లను అందించింది ఈ సాధుతండా. అప్పటి నుంచి ఇంజనీరింగ్‌ చేస్తే ఉద్యోగం వరిస్తుందనే నమ్మకం కల్గింది తండాలోని గిరిపుత్రులకు. ఏకంగా 20 మంది ఇంజనీర్లు అయ్యి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

కంగ్టి(నారాయణఖేడ్‌): అదో మారుమూల తండా. బాహ్యప్రపంచానికి అంతగా తెలియని గిరిజన తండా. అక్కడేం ఉంటుందనుకుంటే పొరపాటే. తరచిచూస్తే చదువులమ్మకు నమస్కరించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తోంది. రోడ్డు వసతి ఉన్నా బస్సు ఎరగరు. తీవ్ర సమస్యలుంటే తప్ప అధికారులు సందర్శించిన దాఖాలాలుండవు. తాగునీటి కోసం తంటాలు పడాల్సిన దుస్థితి. సాగు భూములంతగా లేవు. వ్యవసాయ కూలీ పనులు చేస్తేనే పూట గడిచే పరిస్థితి. అలాంటి తండా నుంచి ప్రభుత్వ ఉద్యోగులు బయటకు కొచ్చా రు. ఒక్కరి నుంచి మొదలైన ప్రభుత్వ ఉద్యోగం.. ఆ తర్వాత ముగ్గురు.. ఇలా ఒక్కొక్కరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తూ ఇప్పుడు ఆ సంఖ్య 40కి చేరింది. ఒకప్పుడు ఎవరికీ తెలియని కంగ్టి మండలంలో జమ్గి(బీ) సాధుతండా ఇప్పుడు అందరి నోటా వినబడుతుంది.

చదువుకోవడానికి 8 కిలో మీటర్లు

జమ్గి(బీ) సాధుతండాలో పాఠశాల లేదు. మండల కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి పిల్లలు చదువుకోవాలంటే నిత్యం ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న తడ్కల్‌ గ్రామానికి నడుచుకుంటూ వెళ్లేవారు. తాము పడే కష్టం తమ పిల్లలు పడకూడదని చదివించారు. మొదట 1998లో ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. తండాకు చెందిన 1998లో కే.పండరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగం సాధించాడు. తర్వాత నారాయణ, మోతీరం 2000 సంవత్సరంలో ఒకేసారి ఉద్యోగం సాధించారు. అనంతరం 2004లో కుషాల్‌ ఇరిగేషన్‌ ఏఈగా ఉద్యోగం సాధించాడు. ఇలా ఒకరి వెనుక మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

40 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో..

ప్రస్తుతం మండలంలో అత్యధిక ఉద్యోగులు ఉన్న తండాగా సాధు తండా పేరొందింది. దాదాపు 40 మందికి పైగా యువతీ, యువకులు పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో దాదాపు 20 మంది ఇంజనీరింగ్‌ ఉద్యోగులే ఉన్నారు. వీరంతా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే బ్యాంకుల్లోనూ, ఉపాధ్యాయులుగాను, వ్యవసాయాధికారులుగాను, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లోనూ, దేశ సరిహద్దుల్లో సైనికులుగాను విధులు నిర్వహిస్తూ తండా ఖ్యాతిని నలుదిశలకు వ్యాపింపజేశారు. ఇంతే కాకుండా బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివిన అక్కాచెల్లెళ్లు చైతన్య, సింధూ యూఎస్‌ఏ లో స్థిరపడ్డారు. వీరి కుటుంబంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగాల్లో ఉన్నారు. తండాకు చెందిన రవిందర్‌ అనే యువకుడు దేశ సరిహద్దులో సైనికుడిగా పని చేస్తున్నాడు. తండాలో ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొంది చదువులు కొనసాగిస్తున్నవారు ఉన్నారు. ప్ర భుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

ఇంజనీర్ల ఇలాకా..1
1/6

ఇంజనీర్ల ఇలాకా..

ఇంజనీర్ల ఇలాకా..2
2/6

ఇంజనీర్ల ఇలాకా..

ఇంజనీర్ల ఇలాకా..3
3/6

ఇంజనీర్ల ఇలాకా..

ఇంజనీర్ల ఇలాకా..4
4/6

ఇంజనీర్ల ఇలాకా..

ఇంజనీర్ల ఇలాకా..5
5/6

ఇంజనీర్ల ఇలాకా..

ఇంజనీర్ల ఇలాకా..6
6/6

ఇంజనీర్ల ఇలాకా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement