
మల్లన్న టర్నోవర్ రూ.45 కోట్లు
2024–2025 ఆర్థిక సంవత్సరానికి మల్లన్న ఆలయ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.45 కోట్ల టర్నోవర్ కాగా.. రూ.20 కోట్ల మేర నికర ఆదాయం సమకూరింది. ఈ మేరకు ఆలయ అధికారులు ఆదాయ, వ్యయ వివరాలను ఆదివారం వెల్లడించారు. ఏడాది కాలంలో టికెట్లు, సేవల ద్వారా రూ.8.39 కోట్లు, ప్రసాద విక్రయాల ద్వారా రూ. 6.31 కోట్లు, హుండీ లెక్కింపు ద్వారా రూ.7.59 కోట్లు, పెట్టుబడుల ద్వారా రూ.12.51 కోట్లు, వడ్డీల రూపంలో రూ. 92.25లక్షలు, లీజ్ అండ్ లైసెన్సుల ద్వారా రూ.2.88 కోట్లు, అన్నదానం ద్వారా రూ.25.72 లక్షలు, ఇతర ఆదాయం రూ. 81.78 లక్షలు, అడ్జెస్ట్‌మెంట్స్ ద్వారా రూ. 63.30 లక్షలు, ప్రారంభ నిల్వ రూ.55.60లక్షలు, బ్యాంకు బ్యాలెన్స్ రూ.5.03 కోట్లతో కలిపి మొత్తం రూ. 45కోట్ల 81లక్ష 77,096 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. వ్యయాల కింద ఉత్సవాల నిర్వహణకు రూ.95.78లక్షలు, ప్రసాదం తయారికీ 4.08 కోట్లు ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జీలు రూ.5.72 కోట్లు, స్ట్యాటూటరీ చెల్లింపులు రూ.3.18 కోట్లు, అడ్జెస్ట్‌మెంట్ రూ. 12.77కోట్లు, ఇతరాలు రూ.74.72 లక్షలు , అన్నదానం రూ. 36లక్షలు, జాతర నిర్వహణ ఖర్చులు రూ. 94లక్షల 89 వేలు, వేతనాలు రూ.1.61కోట్లు, నిర్మాణాలు రూ.5.69 కోట్లు, శానిటేషన్‌కు రూ.1.03 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలిపారు. ముగింపు విలువగా నగదు రూ.15లక్షల 10,221, బ్యాంకు నిలువ రూ.7కోట్ల 2లక్షల 58వేల 281 ఉన్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం నికర ఆదాయం రూ.18.74 కోట్లు రాగా ఈ సంవత్సరం రూ.20 కోట్ల 97 లక్షల 93 వేల 956 ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సరం కంటే 2.23కోట్లు అధికంగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.