20 రోజులు.. రూ.61కోట్లు | - | Sakshi
Sakshi News home page

20 రోజులు.. రూ.61కోట్లు

Mar 12 2025 9:05 AM | Updated on Mar 12 2025 9:05 AM

20 రోజులు.. రూ.61కోట్లు

20 రోజులు.. రూ.61కోట్లు

సంగారెడ్డి జోన్‌: మున్సిపాలిటీల్లో పన్ను వసూలు లక్ష్యం దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పన్ను వసూళ్లపై సమీక్షలు చేపట్టి వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 31 లోపు పన్ను వసూళ్లు చేయాలని లక్ష్యం ఉన్నప్పటికీ, గడువులోపు పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఇప్పటివరకు జిల్లాలో సగానికి మాత్రమే పన్ను వసూళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా ఆయా మున్సిపాలిటీలలో ఆస్తులపై పన్ను వసూలు చేసి నిర్వహణతోపాటు అభివృద్ధికి నిధులు సమకూర్చనున్నారు.

పన్ను వసూళ్ల లక్ష్యం రూ.122 కోట్లు

జిల్లాలోని ఉన్న పాత మున్సిపాలిటీలలో రూ.122,82,70,230లు పన్ను వసూలు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. ఈనెల 10 వరకు జిల్లావ్యాప్తంగా రూ. 61,72,24,609ల మేర పన్ను వసూలు అయినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలలో అత్యధికంగా నారాయణఖేడ్‌ పట్టణం మున్సిపాలిటీలో పన్ను వసూలు కాగా అతి తక్కువగా సదాశివపేట మున్సిపాలిటీలో వసూలు అయ్యాయి. ఈ మేర జిల్లావ్యాప్తంగా 50.25% పన్ను వసూలు నమోదు అయింది.

సవాలుగా మారిన పన్ను వసూళ్లు

2024–2025ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆయా మున్సిపాలిటీలలో రూ.61,10,45,621లు పన్ను వసూలు చేయాల్సి ఉంది. జిల్లాలో ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులకు పన్నువసూలు పెద్ద సవాల్‌గా మారింది. ఇదిలాఉండగా కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో ఆన్‌లైన్‌ విధానంలోకి మార్చకపోవడంతో ఇంకా వసూలు ప్రారంభించలేదు.

(ఈ నెల 10 వరకు)

(రూ. లలో)

ఆన్‌లైన్‌ విధానంలో చెల్లింపులు

మున్సిపాలిటీలలో పన్ను వసూళ్లు మాన్యువల్‌ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్‌లైన్‌ పద్ధతిలో వసూలు చేస్తున్నారు. ప్రత్యేక ఆన్‌లైన్‌ మిషన్‌ ద్వారా పన్ను వసూలు చేసి వెంటనే వారికి రసీదును అందిస్తున్నారు. వసూలు అయిన పన్ను పక్కదారి పట్టకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలే...

మున్సిపాలిటీలలో పన్ను వసూళ్లపై అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. త్వరిగతిన పూర్తి చేయాలని అధికారుల ఆదేశాలు బేఖతార్‌ చేస్తున్నారు. వసూళ్లపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇటీవల పన్నువసూళ్లపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేస్తూ 17మంది అధికారులకు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మున్సిపల్‌లో వసూలు 50%మాత్రమే వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు

నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు గడువులోపు పన్ను లక్ష్యం నెరవేరేనా?

జిల్లాలోని మున్సిపాలిటీలలో పన్ను వసూళ్ల వివరాలు

మున్సిపాలిటీ వసూలు చేయాల్సింది వసూలు చేసింది

అమీన్‌పూర్‌ 31,93,63,300 19,40,65,553

అందోల్‌ 1,31,98,056 92,12,905

బొల్లారం 15,97,84,799 11,32,13,985

ఇస్నాపూర్‌ 2,42,39,557 –––

నారాయణఖేడ్‌ 2,42,67,285 1,78,06,664

సదాశివపేట 11,17,59,118 3,06,97,841

సంగారెడ్డి 16,30,04,008 7,40,95,113

తెల్లాపూర్‌ 25,04,61,107 12,81,62,506

జహీరాబాద్‌ 16,21,93,000 4,99,70,042

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement