● పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఒకరు.. అనారోగ్యంతో మరొకరు ..
పటాన్‌చెరు టౌన్: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.... రామచంద్రాపురం మండలం వెలిమెల తండాకు చెందిన విజయ(22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సోమవారం తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయ చున్నీతో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం వారు ఇంటికొచ్చి చూస్తే విగతజీవిగా కనిపించింది. తన కూతురుకు పెళ్లి సంబంధాలు చూడటం ఇష్టం లేదని దీంతో ఆత్మహత్య చేసుకుందని మంగళవారం తల్లి తులసి ఫిర్యాదు చేశారు.
జిన్నారం (పటాన్‌చెరు): అనారోగ్యంతో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుమ్మడిదల మండలం అన్నారంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం జార్ఖండ్‌కు చెందిన రవీంద్ర శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదేళ్ల క్రితం అన్నారానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. చిన్న కుమార్తె ఖుషీ కుమారి (21) కొన్ని రోజులుగా తరచూ ఫిట్స్ వస్తుండటంతో భరించలేక యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తులో ఉంది.