దోష నివారణ చేస్తానని.. గుడి వద్ద ఉండమని చెప్పి.. సొమ్ముతో.. | - | Sakshi
Sakshi News home page

దోష నివారణ చేస్తానని.. గుడి వద్ద ఉండమని చెప్పి.. సొమ్ముతో..

Aug 8 2023 6:12 AM | Updated on Aug 8 2023 12:21 PM

- - Sakshi

సంగారెడ్డి: ఇంటికి దోష నివారణ పూజ చేస్తానని యజమానులకు టోకరా వేసి బంగారంతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన అంబేద్కర్‌నగర్‌లో సోమవారం వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిముత్తగల్ల భూమవ్వ పెద్ద కుమారుడు బాబు గడ్ల వ్యాపారస్తుడి వద్ద డ్రైవర్‌. గతేడాది మొహర్రం పండగ రోజు అతను విజయవాడకు చెందిన షేక్‌ మస్తాన్‌ను ఇంటికొచ్చాడు.

గృహానికి దోషం ఉందని నివారణకు పూజ చేయాలంటే తిరస్కరించారు. తాజాగా బాధితురాలి చిన్న కుమారుడైన మధుతో మస్తాన్‌ సోషల్‌ మీడియాలో చాటింగ్‌ చేసి నంబర్‌ తీసుకున్నాడు. ఆదివారం సాయంత్రం విజయవాడ నుంచి వచ్చి, పూజ చేస్తున్నాడు. మధ్యలో అమ్మవారి అలంకరణకు బంగారు నగలు కోరాడు. 2.5 తులాల పుస్తెల తాడు, పావు తులం కమ్మలు, 5 తులాల వెండి పట్టీలు ఇచ్చారు.

ఈ తంతు ముగిసిన అనంతరం సామగ్రిని సిద్దిపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఓ ప్రాంతంలో పడవేయాలని చెప్పగా మధు వెళ్లాడు. పొద్దు పోయే వరకు రాలేదు కాల్‌ చేయగా తనను గుడి వద్ద ఉండమని చెప్పి మస్తాన్‌ వెళ్లాడు. తర్వాత కుటుంబీకులు అనుమానం వచ్చి గదిలో వెళ్లి చూస్తే బంగారం నగలు లేవు. తాము మోసపోయామని గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆ మేరకు కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement