స్నేహితుడిని కలిసేందుకు వెళ్తూ.. | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడిని కలిసేందుకు వెళ్తూ..

Jul 22 2023 5:52 AM | Updated on Jul 22 2023 9:11 AM

- - Sakshi

సంగారెడ్డి: బైక్‌, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన చేగుంట శివారులోని మక్కరాజీపేట బైపాస్‌ బ్రిడ్జి సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామయంపేట మండలం జాన్సిలింగాపూర్‌కు చెందిన టాకూర్‌ బాలాజీసింగ్‌(32), కోళ్ల రవితేజ(20) బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తున్నారు. చిన్నశివునూర్‌ శివారు నుంచి వస్తున్న కంటైనర్‌, బైక్‌ మక్కరాజీపేట బైపాస్‌బ్రిడ్జి సమీపంలో 44వ నంబర్‌ రహదారిపై ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాలాజీసింగ్‌, రవితేజలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలాజీసింగ్‌ కూలీ పనులు చేసుకునేవా డు కాగా, రవితేజ ఉపాఽధి హామీ పనులతోపాటు ఇతరేతర పనులు చేసుకునేవాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందారు. వీరి మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement