దళితుల భూములు లాక్కోవద్దు | Sakshi
Sakshi News home page

దళితుల భూములు లాక్కోవద్దు

Published Tue, Jun 27 2023 4:40 AM

ధర్నా చేస్తున్న సదాశివపేట రైతులు, కేవీపీఎస్‌ నాయకులు  - Sakshi

డాపూర్‌(సంగారెడ్డి): సదాశివపేట దళితుల భూములు గుంజుకోవద్దని, హెచ్‌ఎండీ లేఅవుట్‌ పేరిట వారి భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ దందా ఆపాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సదాశివపేట దళితులు వారి భూములను రియల్‌ ఎస్టేట్‌ దందాకు ఇవ్వొద్దని కోరుతూ కులవ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ సదాశివపేట పట్టణ శివారులోని సర్వే నంబర్‌ 165లోగల 114.21 ఎకరాల భూమిలో గత 50 సంవత్సరాలుగా 200 మంది దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారన్నారు.

హైదరాబాద్‌ – ముంబయి నేషనల్‌ హైవే కు ఆనుకొని ఆ భూములు ఉన్నాయన్నారు. వాటి విలువ సుమారు రూ.350 కోట్లకు పైగా ఉంటుందన్నారు. పేద దళితుల భూములను గుంజుకొని రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తారా? అని ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ లే అవుట్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ దందా వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌, జిల్లా సభ్యుడు మోహన్‌ దాస్‌, సదాశివపేట దళిత రైతులు సిద్దాపురం శంకరయ్య, చుక్కల మానేయ, కర్రె సుధాకర్‌, సంజీవులు, సునందరావు, అనూప్‌ కుమార్‌, ప్రేమ్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు .

Advertisement
 
Advertisement