విద్యుత్‌ వాహనాల జోరు | India Booming Electric Vehicle | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వాహనాల జోరు

Feb 25 2025 4:30 AM | Updated on Feb 25 2025 4:32 AM

India Booming Electric Vehicle

2024లో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో ఈవీలు 7 %

అత్యధికంగా త్రిపురలో 8.5 శాతం ఈవీలు 8.2 శాతంతో రెండో స్థానంలో ఢిల్లీ ఆర్‌బీఐ బులెటిన్‌ వెల్లడి

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2021లో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు కేవలం 2 శాతం కన్నా తక్కువగానే ఉండగా.. 2024లో 7 శాతానికి పైగా నమోదైందని ఆర్‌బీఐ విడుదల చేసిన బులెటిన్‌ వెల్లడించింది. 2024లో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో త్రిపురలో అత్యధికంగా 8.5 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉండగా..

ఢిల్లీలో 8.2 శాతం, గోవాలో 7.1 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 2.3 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాలు రిజిస్ట్రేషన్‌ అయినట్టు ఆ బులెటిన్‌ పేర్కొంది. కేంద్రం ఇన్నోవేషన్‌ వెహికల్‌ ప్రోత్సాహం పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించడంతో పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య పెరుగుతోందని బులెటిన్‌ తెలిపింది. 2024లో అత్యధికంగా కర్ణాటకలో 5,765, మహారాష్ట్రలో 3,728, ఉత్తరప్రదేశ్‌లో 1,989 పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటైనట్టు పేర్కొంది.  –సాక్షి, అమరావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement