జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్ మెథాంఫేటమిన్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు కొనుగోలు చేస్తున్న వ్యక్తిని జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని రిమాండుకు తరలించారు. శనివారం పేట్‌బషీరాబాద్‌లో డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం చింతల్ గణేష్‌నగర్ కమాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నిషేధిత మెథాంఫేటమిన్ డ్రగ్ విక్రయిస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేశారు. డ్రగ్‌ను విక్రయిస్తున్న జీడిమెట్లకు చెందిన వేముల సాయికుమార్(25)తో పాటు డ్రగ్ కొనుగోలు చేస్తున్న తిరుమల అరవింద్‌ను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.63.20 లక్షల విలువైన 316 గ్రాముల మెథాంఫేటమిన్ డ్రగ్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డ్రగ్ సరఫరా చేసే కుత్బుల్లాపూర్‌కు చెందిన ప్రధాన నిందితుడు పూజిత్ పరారీలో ఉన్నాడు. శనివారం సాయికుమార్, అరవింద్‌లను రిమాండుకు తరలించారు.
ఎయిర్‌పోర్టులో 950 గ్రాముల గంజాయి పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అక్రమంగా తీసుకొచ్చిన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం థాయ్ విమానాంలో వచ్చిన కజాస్ అస్లం అనే ప్రయాణికుడి కదలికల్లో అనమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అతడిని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి లగేజీలో హైడ్రోపోనిక్ విధానంలో పండించిన 950 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు దర్యాప్తు చేపడుతున్నారు.
విదేశీ కరెన్సీతో..
ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రయాణికుడి వద్ద నిబంధనలకు విరుద్దంగా తీసుకెళుతున్న విదేశీ కరెన్సీపట్టుబడింది. ఆస్ట్రేలియాకు చెందిన సుగోవ్ అబ్‌సేమ్ అడెన్ అనే వ్యక్తి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో శుక్రవారం అర్థరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు వచ్చాడు. తనిఖీల సమయంలో అతడి బ్యాగులో భారత కరెన్సీలో 23 లక్షల విలువ చేసే వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఉండడంతో అతడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరికి రిమాండ్


