ప్రాణరక్షణలో ట్రామా మెడిసిన్‌ కీలకం | - | Sakshi
Sakshi News home page

ప్రాణరక్షణలో ట్రామా మెడిసిన్‌ కీలకం

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

మణికొండ: పెరుగుతున్న ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ట్రామా మెడిసిన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని..అది క్లిష్ట పరిస్థితుల్లోను ప్రాణాలను రక్షిస్తుందని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. శనివారం ఫైనాన్షియల్‌ జిల్లాలోని మెడికవర్‌ ఆసుపత్రిలో నిర్వహించిన ట్రామా, కాన్ల్ఫిక్ట్‌ మెడిసిన్‌పై జరిగిన జాతీయ సదస్సులో గవర్నర్‌ ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాణాపాయ పరిస్థితుల్లో వైద్యుల సత్వర నిర్ణయాలు, సాంకేతిక నైపుణ్యాలు ప్రాణాలను రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. అలాంటి సందర్భాల్లో వైద్యుల అంకితభావమే అత్యంత శక్తివంతమైన సాధనమన్నారు. మన దేశంతో పాటు విదేశాల నుంచి నిపుణులు హాజరుకావటం సంతోషకరమని, ఈ జ్ఞాన మార్పిడి దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి ఎం. దానకిషోర్‌, మెడికవర్‌ చైర్మెన్‌, ఎండీ జి.అనిల్‌కృష్ణ, ఎగ్గిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఎ.శరత్‌రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement