మొయినాబాద్: ఇంటి ఎదుట పార్కుచేసిన రెండు బైకులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మొయినాబాద్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన మహమ్మద్ యూసుఫ్ టీఎస్ 11 ఈఎక్స్ 5870 నెంబరు గల యమహా బైక్‌ను ఈ నెల 1న రాత్రి తన ఇంటి ఎదుట పార్కు చేశాడు. మొయినాబాద్‌కు చెందిన మెరుగు రమేశ్ టీఎస్ 06 ఈఎం 5046 నెంబరు గల స్ప్లెడర్ ప్లస్ బైకును ఈ నెల 1న రాత్రి తన ఇంటి ముందు పార్కుచేసి పడుకున్నాడు. గుర్తుతెలియని దుండగులు అర్థరాత్రి సమయంలో రెండు బైకులను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై బాధితులు శనివారం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
యుద్ధ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయండి
షాద్‌నగర్: సామ్రాజ్యవాద యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతికోసం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నేడు(ఆదివారం)నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శనివారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యుద్ధ వ్యతిరేక సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ విజయ్, రాఘవాచారి హాజరవుతారన్నారు. అన్నివర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యకరమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్, రవీంద్రనాథ్, నర్సింలు, నర్సింలు, సత్యం, కృష్ణ, తిరుమలయ్య, ఈశ్వర్‌నాయక్, కృష్ణయ్య, సత్యనారాయణ, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


