అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో పునరుద్ధరించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
● చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు
● విశ్వక్సేనుడి ఆరాధనతో ప్రారంభించిన అర్చకులు
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు.. వేద మంత్రోశ్చరణతో ఆల యాన్ని శుద్ధి చేశారు. అనంతరం పుట్ట బంగారం (పుట్టమన్ను) తెచ్చి హోమగుండాలు ఏర్పాటు చేశారు. అందులో నవధాన్యాలు, పాలికలు కలిపి హోమాలు వెలిగించారు. అనంతరం విశ్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలు చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. పూజా కార్యక్రమాలు తిరుమల కిరణాచారి, రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి పాల్గొన్నారు.
నేడు ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణం, శేషవాహనం నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిచి ధ్వజస్తంభానికి గరుడ పఠాన్ని ఆరోహణం చేస్తారు. గరుడ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులకు ప్రసాదం పంపిణీ ఉండ దని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు.


