షాబాద్: సీతారాంపూర్‌లో కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు
తుర్కయంజాల్: అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు
కల్యాణం.. రామణీయం
మామిడి తోరణాలు.. పూల పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు.. బాజాభజంత్రీలు.. వేదపండితుల మంత్రోచ్చరణలు.. అషేశభక్తజన సందోహం మధ్య రాములోరి కల్యాణోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామనామస్మరణతో ఊరూవాడా మార్మోగాయి. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడ చూసినా కోలాహలం నెలకొంది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.


