గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు
ఆమనగల్లు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం మున్సిపల్ పరిధిలోని సాకిబండతండాలో రెవెన్యూ, అటవీశాఖ, ఇరిగేషన్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సర్వే పనులు చేపట్టారు. దాదాపు కిలోమీటరు సర్వే పనులు పూర్తి చేశారు. ఇదే సమయంలో శనివారం తండాకు చెందిన గిరిజన రైతులు వచ్చి సర్వేను అడ్డుకున్నారు. భూమి కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.కోటి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరి కి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, ఫ్యూచర్ సిటీలో 500 గజాలస్థలం ఇవ్వాలని కోరారు. రైతులు సర్వేను అడ్డుకోవడంతో వివిధ శాఖల అధికారులు సిబ్బంది వెనుదిరిగారు.
పశు పోషణలో
జాగ్రత్తలు తప్పనిసరి
షాద్‌నగర్: పశు పోషణలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ విజయ్‌కుమార్ సూచించారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడలోని గోపాలమిత్ర కేంద్రంలో శనివారం ఉచిత పశు వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ..సాధారణంగా పాడి పశువులు అల్ప ఉష్ణోగ్రతలతో అసౌకర్యానికి గురవుతుంటాయని, చలికాలంలో తీవ్రమైన మా ర్పులు వస్తుంటాయని అన్నారు.ఏవైనా మా ర్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని పశువైద్యులను సంప్రదించి చికి త్స చేయించాలని తెలిపారు. అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్‌కుమార్, ఉప సర్పంచ్ అశో క్, పశువైద్యాధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ ముక్కంటి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
రేపు అథ్లెటిక్స్ పోటీలు
హుడాకాంప్లెక్స్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5న జిల్లా స్థాయి సబ్‌జూనియర్, అండర్–20 అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ ఇ.గోపి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. అండర్–8, అండర్–10, అండర్–12, అండర్–14, అండర్–20 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా అథ్లెటిక్స్ కోచ్ తిప్పాన సాయిరెడ్డిని 97038 38987 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కన్హాలో ప్రారంభమైన బ్యాడ్మింటన్ పోటీలు
నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతి వ నంలోని హార్ట్‌ఫుల్‌నెస్ గోపీచంద్ బ్యాడ్మింట న్ అకాడమీ (హెచ్‌జీబీఏ)లో యూనెక్స్–సన్‌రైజ్ ఆల్‌ఇండియా ఆధ్వర్యంలో జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్–2026ను శనివారం ప్రారంభించినట్లు కన్హా పీఆర్‌ఓ చంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ వరకు క్రీడలు కొనసాగుతాయని, పోటీ ల్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అండర్–19 విభాగంలో 1,100 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.10న ఫైనల్ పోటీలు ఉంటాయన్నారు. శనివారం 280 మ్యాచ్‌లు నిర్వహించినట్లు వివరించారు.
ఆ ఊరి పేరు మార్చండి
దోమ: దొంగ ఎన్కేపల్లి పేరు కారణంగా విద్యావేత్తలు, విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దోమ మండలం దొంగ ఎన్కేపల్లి పేరును సంజీవనగర్‌గా మార్చాలని కోరారు. గ్రామంలో సంజీవస్వామి పురాతన ఆలయం ఉందని ఆ పేరును గ్రామానికి పెట్టా లని విన్నవించారు. గతంలో ఇదే విషయాన్ని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపా డేలా దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు
గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు


