ఒడిశా టు హైదరాబాద్
కారులో గంజాయి తరలింపు
మొయినాబాద్: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన పబిత్ర సర్కార్, అమ్రితో పరమాణిక్ శనివారం ఒడిశా నుంచి 22 కిలోల గంజాయిని కారు (ఓడీ 02 బీఎల్ 3033)లో హైదరాబాద్‌కు తరలిస్తు న్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి మొయినాబాద్ మున్సిపల్ పరి ధిలోని అజీజ్‌నగర్ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అనుమానంతో కారును తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. 22 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకుని, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి పింటు, ఎన్క అనే వ్యక్తుల నుంచి తీసు కుని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


