గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేషనల్‌ ఎగ్‌, చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బాలస్వామి పేర్కొన్నారు. | - | Sakshi
Sakshi News home page

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేషనల్‌ ఎగ్‌, చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బాలస్వామి పేర్కొన్నారు.

Dec 29 2025 10:53 AM | Updated on Dec 29 2025 10:53 AM

గుడ్డ

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేషనల్‌ ఎగ్‌, చికెన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బాలస్వామి పేర్కొన్నారు. సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 8లోu 53వ డివిజన్‌గా కొహెడను ప్రకటించాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించండి ఫాంహౌస్‌ల్లో విస్తృత తనిఖీలు

న్యూస్‌రీల్‌

మచ్చ తెచ్చిపెట్టిన అక్రమార్కులు

ఉమ్మడి జిల్లాలో కేసుల వివరాలు

తుర్కయంజాల్‌: తుర్కయంజాల్‌ సర్కిల్‌ను ఆదిబట్ల సర్కిల్‌లో విలీనం చేయడంతో పాటు 53వ డివిజన్‌గా కొహెడను కొనసాగించకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం కొహెడలో జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. లక్షకు పైగా జనాభా ఉన్న తుర్కయంజాల్‌ సర్కిల్‌ను ఆదిబట్లలో విలీనం చేయడం రాజకీయకక్ష సాధింపు చర్యలో భాగం అన్నారు. వరుసగా ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహారిస్తోందని, ఇకనైనా స్పందించి తుర్కయంజాల్‌ సర్కిల్‌ను యథావిధిగా కొనసాగించడంతో పాటు కొహెడను డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

తుర్కయంజాల్‌: ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రశ్నించాలని ఆదివారం ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెనిగె విష్ణువర్ధన్‌, జిల్లా అధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.నరేంద్ర గౌడ్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షుడు నక్క జంగయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మొయినాబాద్‌: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ సైబరాబాద్‌ పోలీసులు ఫాంహౌస్‌లపై నిఘా పెంచారు. అందులో భాగంగా శనివారం అర్థరాత్రి రాజేంద్రనగర్‌ డీసీపీ యోగేష్‌గౌతమ్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్‌ఐలు, 70 మంది సిబ్బందితో అజీజ్‌నగర్‌, సురంగల్‌, శ్రీరాంనగర్‌, కుత్బుద్దీన్‌గూడల్లోని ఫాంహౌస్‌ల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ లు నిర్వహిస్తున్న నిర్వాహకులు, ఫాంహౌస్‌లపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్‌ పార్టీలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే ఫాంహౌస్‌లను సీజ్‌ చేసి నిర్వాహకులు, యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో చేవెళ్ల ఏసీపీ కిషన్‌, మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీజేఆర్‌ సేవలు చిరస్మరణీయం

పంజగుట్ట: తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం పోరాడిన మహానాయకుడు పి.జనార్ధన్‌ రెడ్డి అని, ఆయన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. పీజేఆర్‌ 18వ వర్ధంతిని పురస్కరించుకుని ఖైరతాబాద్‌ కూడలిలోని ఆయన విగ్రహానికి మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, మహ్మద్‌ అజహరుద్దీన్‌, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, కార్పొరేషన్ల చైర్మన్లు నుతి శ్రీకాంత్‌, కాల్వ సుజాత, సీనియర్‌ నాయకుడు ఫెరోజ్‌ ఖాన్‌, పీజేఆర్‌ కూతురు, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీజేఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, హైదరాబాద్‌ నగరానికి, పేదలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

నెత్తుటి

అవినీతి

మాట్లాడుతున్న ధ్యాన గురువు పరిణిత పత్రి

కళాకారుల నృత్య ప్రదర్శన

కడ్తాల్‌: మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు ఎనిమిదో రోజు వైభవంగా కొనసాగాయి. వరుసగా సెలవులు రావడంతో పాటు ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధ్యాన గురువు పరిణిత పత్రి మాట్లాడుతూ.. బ్రహ్మర్షీ పత్రీజీ చెప్పిన విధంగా మానవుల్లో ఎనిమిది స్థితులుంటాయని తెలిపారు. పిరమిడ్‌ మాస్టర్‌ డాక్టర్‌ యుగంధర్‌ ధ్యానం విశిష్టతను వివరించారు. పిరమిడ్‌ మాస్టర్లు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం పలు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో ట్రస్ట్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జిల్లాలో నేరాలు.. ఘోరాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. ఒకవైపు రోడ్డు ప్రమాదాలు.. మరోవైపు ఆస్తి తగాదాలు.. ఇంకోవైపు హత్యలు.. అత్యాచారాలతో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. వివాహేతర సంబంధాలు.. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి ఘాతుకాలు.. భూముల కబ్జాలు తదితరాలతో ఈ ఏడాది గడిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా 211 హత్యలు జరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదిలా ఉంటే అక్రమ వసూళ్లకు పాల్పడ్డ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల తీరని మచ్చను మిగిల్చారు.

– సాక్షి, రంగారెడ్డిజిల్లా

జిల్లాలోని పలు జాతీయ రహదారులు ఈ ఏడాది రక్తపుటేరులు పారించాయి. అనేక మందిని బలితీసుకుని కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చాయి. నవంబర్‌ 3న తెల్లవారు జామున చేవెళ్ల–బీజాపూర్‌ జాతీయ రహదారిపై మీర్జాగూడ వద్ద టిప్పర్‌–బస్సు ఢీకొన్న ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 27 మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. చేవెళ్ల, బెంగళూరు, శ్రీశైలం, విజయవాడ, నాగార్జునసాగర్‌ రహదారులతో పాటు ఔటర్‌రింగ్‌ రోడ్లపై 8,377 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 1,665 మంది మృత్యు వాతపడ్డారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. షాద్‌నగర్‌, కొత్తూరు, నందిగామల్లోని పలు పారిశ్రామికవాడల్లో రియాక్టర్లు పేలి అనేక మంది కార్మికులు మృత్యువాత పడ్డారు.

ఆస్తి తగాదాలు.. పరువు హత్యలు

ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాయ పోల్‌లో కులాంతర వివాహం చేసుకుందనే అక్కసుతో అక్క (మహిళా కానిస్టేబుల్‌)ను తమ్ముడు హత్య చేయడం సంచలనం సృష్టించింది.

షాద్‌నగర్‌ పరిధిలోని ఎల్లంపల్లిలో నవంబర్‌ 12న పరువు హత్య చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికుల కులాంతర వివాహానికి కారణమయ్యాడనే పేరుతో రాజశేఖర్‌ అనే యువయుడిని కిరాతకంగా హత్య చేసి నవాబుపేట మండలం ఎన్మనగండ్ల గేటు వద్ద పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.

మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జిల్లెల్‌గూడలో నివాసం ఉంటున్న మాజీ సైనికోద్యోగి గురుమూర్తి జనవరి 15న తన భార్యను అతికిరాతంగా చంపి, ముక్కలుగా నరికి బకెట్లో ఉడికించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

ఆగస్టు 31న దండుమైలారంలో 11 గుంటల భూమి ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాాల్లో తీరని విషాదం నింపింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో మహిళ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడాల్సి వచ్చింది.

ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని పిట్టలగడ్డ తండాకు చెందిన శివలీల జనవరి 25న పట్టణంలోని లాడ్జిలో దారుణ హత్యకు గురైంది.

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య మౌనిక ప్రియుడు అశోక్‌తో కలిసి భర్త యాదయ్యను ఫిబ్రవరి 18న దారుణంగా హత్య చేశారు

బెంగళూరు జాతీయ రహదారి సమీపంలోని ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమ పక్కన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఏప్రిల్‌ 13న దారుణ హత్యకు గురయ్యాడు.

షాబాద్‌లోని ఓ వైన్‌ షాప్‌లో మార్చి 13న భిక్షపతి అనే వ్యక్తిని తుమ్మలపల్లి నరేందర్‌ అనే వ్యక్తి దొంగతనానికి వచ్చి హత్య చేశాడు.

జిల్లా రహదారులపై రక్తపుటేరులు

తీరని విషాదం నింపిన మీర్జాగూడ ఘటన

కలకలం రేపిన మాజీ సైనికోద్యోగి ఉదంతం

సంచలనం సృష్టించిన పరువు హత్య

ఏసీబీ వలకు చిక్కిన అక్రమార్కులు

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ఏసీబీ పంజా విసిరింది. రెవెన్యూ, విద్యుత్‌, మున్సిపల్‌, ఇతర శాఖల్లోని అక్రమార్కులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేసింది.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జిల్లా సర్వేయర్‌ శ్రీనివాసులు ఇంటిపై సోదాలు నిర్వహించారు. రూ.100 కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి, కేసు నమోదు చేశారు. ఇబ్రహీంబాగ్‌ డివిజన్‌ ఏడీఈ అంబెడ్కర్‌ ఇంట్లో సోదాలు నిర్వహించి, అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

మణికొండ మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ డీఈ దివ్యజ్యోతి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఆమె అవినీతిని స్వయంగా ఆమె భర్త వీడియోలు తీసి సోషల్‌ మీడియా వేదికగా బయటపెట్టడం విశేషం.

నార్సింగి టీపీఓ మణిహారిక ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ కోసం రూ.10 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. రాజేంద్రనగర్‌ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌ ఓ అక్రమ నిర్మాణానికి ఇంటి నంబర్‌ ఇచ్చేందుకు రూ.2 లక్షలు డిమాండ్‌ చేసి దొరికిపోయారు.

నల్లా కనెక్షన్‌ కోసం రూ.30 వేలు డిమాండ్‌ చేసిన మణికొండ జలమండలి మేనేజర్‌ స్ఫూర్తిరెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు.

నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి డీటీఆర్‌ మంజూరు కోసం రూ.50 వేలు డిమాండ్‌ చేసిన గచ్చిబౌలి ఏడీఈ సతీష్‌ ఏసీబీకి పట్టుబడ్డారు.

తుర్కయంజాల్‌ పరిధిలోని 200 గజాల గ్రామకంఠం భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.70 వేలు డిమాండ్‌ చేసిన వనస్థలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌ ఏసీబీకి దొరికిపోయారు.

పాసుబుక్‌లో జండర్‌ సవరణ కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన ఘటనలో ఆమనగల్లు తహసీల్దార్‌ లలిత, సర్వేయర్‌ రవిపై కేసులు నమోదయ్యాయి.

భూమి పేరు మార్పిడీ విషయంలో రూ.50 వేలు డిమాండ్‌ చేసిన తలకొండపల్లి తహసీల్దార్‌ నాగార్జున సహా వీఆర్‌ఏ యాదగిరిపై కేసు నమోదైంది.

నిషేధిత జాబితాలోని భూమిని పట్టా భూమిగా మార్చేందుకు రూ.12 లక్షలు డిమాండ్‌ చేసిన కేసులో ఇబ్రహీంపట్నం ఆర్‌ఐ కృష్ణను ఏసీబీ అరెస్ట్‌ చేసింది.

కేసులు సైబరాబాద్‌ రాచకొండ వికారాబాద్‌

రోడ్డు ప్రమాదాలు 4,608 3,488 281

రోడ్డు ప్రమాద మృతులు 850 659 156

సైబర్‌నేరాలు 7,636 3,569 184

హత్యలు 113 73 25

కిడ్నాప్‌లు 479 65 –

దోపిడీలు/దొంగతనాలు 118 68 230

అత్యాచారాలు 330 63 –

వరకట్న/గృహ హింస 1,314 800 –

మహిళలపై వేధింపులు 1,043 782 –

డ్రగ్స్‌, గంజాయి 353 256 –

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష1
1/7

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష2
2/7

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష3
3/7

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష4
4/7

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష5
5/7

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష6
6/7

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష7
7/7

గుడ్డు ఆరోగ్యదాయిని గుడ్డు సంపూర్ణ ఆరోగ్యదాయిని అని నేష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement