రాజ్యాంగం పవిత్ర గ్రంథం
షాద్‌నగర్‌రూరల్: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ఎంతో పవిత్రమైనదని జిల్లా అదనపు జడ్జి స్వాతి రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం షాద్‌నగర్ కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిబ్బందితో భారత రాజ్యాంగ పీఠికను చదివించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు జడ్జి స్వాతిరెడ్డి మాట్లాడుతూ.. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్య్ర రాజ్యంగా నిర్మించుకునేందుకు రాజ్యాంగం ఎంతో ఉపయోగపడిందన్నారు. వ్యక్తిగత గౌరవం జాతి ఐక్యతను, అఖండతను రాజ్యాంగం సంరక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహానికి నివాళి
రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకొని బుధవారం పట్టణంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ తాలూక అధ్యక్షుడు సురేందర్, పట్టణ అధ్యక్షుడు అనిల్, నాయకులు బాదేపల్లి సిద్దార్థ, జాంగారి రవి, నాగి సాయిలు, కృష్ణయ్య, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అదనపు జడ్జి స్వాతి రెడ్డి


