చెరువులు, కుంటలు కాపాడండి
హైడ్రా కమిషనర్‌కు వినతి
తుక్కుగూడ: జిల్లాలోని చెరువులు, కుంటలను కబ్జాదారుల చెర నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి కోరారు. బుధవారం ఆయన నగరంలోని హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూముల ధరలకు రెక్కలు రావడంతో భూకబ్జాదారులు ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఇరిగేషన్‌కు సంబంధించిన భూముల్లో మట్టిపోసి పాత తేదీల్లో ఎన్‌ఓసీలు సృష్టించి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మివేస్తున్నారని ఆరోపించారు. వినతిపత్రంలో సంఘం నాయకులు కె.శ్రీనివాస్, విష్ణుమూర్తి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.


