భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
మంచాల: భక్తులకు ఇబ్బంది కలగకుండా చూ డాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి సురేష్ మోహన్ అన్నారు. మండల పరిధి ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం ఆయన దర్శించుకొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తచెదారాన్ని తొలగించాలన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ ఉమారాణి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌లు పాల్గొన్నారు.


