చింతలేని జీవితం | - | Sakshi
Sakshi News home page

చింతలేని జీవితం

Nov 6 2025 9:46 AM | Updated on Nov 6 2025 9:46 AM

చింతల

చింతలేని జీవితం

చిరు వ్యాపారం..

చిరువ్యాపారం.. చింతలేని జీవితం. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం. శ్రమించాల్సిన అవసరం లేదు. నష్టపోతామనే బెంగలేదు. పన్ను చెల్లించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఖాళీ స్థలం ఉంటే చాలు రోడ్డుపైనే దుకాణం. నిత్యం రొక్కం.. చేతినిండా డబ్బుతో జీవన ప్రయాణం ఆనందమయం.

యాచారం: వ్యవసాయ భూములు లేని వారు.. ఆర్థికంగా పరిస్థితి అంతగా లేనివారు.. చిరువ్యాపారాలను ఎంచుకుంటున్నారు. నిత్యం రూ.500 నుంచి రూ.1,500లకు పైగానే ఆదాయం పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమలాగే పిల్లలు ఇబ్బంది పడకూడదని.. వారిని ఉన్నత చదువులు చదివించి, జీవితాన్ని బంగారు మయం చేసేందుకు నిరంతరం తాపత్రయ పడుతున్నారు. ఈ కోవలో యాచారం మండలం యాచారం, మాల్‌, గునుగల్‌, నక్కర్తమేడిపల్లి,నందివనపర్తి, చింతపట్ల, చింతుల్ల, గడ్డమల్లయ్యగూడ తదితర గ్రామాలకు చెందిన వారు సుమారు వెయ్యి మందికి ఉన్నారు. కేవలం యాచారం, మాల్‌ కేంద్రాల్లో 300 మందికి పైగా ఉన్నారు. ఏ చింతలేకుండా ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు.

బ్యాంకుల విశ్వాసం..

చిరువ్యాపారులకు రుణం ఇస్తే.. వాయిదాలు సక్రమంగా చెల్లిస్తుంటారన్న విశ్వాసంతో బ్యాంకులు వారు అడిగిందే తడవుగా వ్యక్తిగత పూచితోనే అప్పు ఇస్తుంటాయి. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అందజేస్తుంటాయి. యాచారం డీసీసీబీ బ్యాంకులో 82 మందికి రూ.లక్ష చొప్పున, రూ.82 లక్షల రుణాలను అందజేశారు. ఇలా రుణం పొందిన వ్యాపారులు.. వాయిదాలను క్రమంగా నేరుగా బ్యాంకులో చెల్లిస్తుంటారు. అదే విధంగా నక్కర్తమేడిపల్లి ఇండియన్‌ బ్యాంకు, మాల్‌ ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు, యాచారంలోని పీఏసీఎస్‌లోనూ రుణాలు పొందుతున్నారు. వ్యక్తిగత నమ్మకంతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగి సమ్మతి సంతకంతో రుణాలు ఇస్తున్నారు. మొత్తంగా మండల పరిధిలో చిరువ్యాపారులు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.3 కోట్లకు పైగాను లోన్లు పొంది, మిర్చి, సమోసాలు, పండ్లు, పూలు, చాయ్‌ బండి, కూరగాయలు ఇలా తదితర వ్యాపారం చేస్తుంటారు.

పొలాల్లో సేకరించి..

చిరువ్యాపారులు చాలా మంది గ్రామాల్లోని వ్యవసాయ పొలాల వద్ద కూరగాయలను సేకరించి, వీధుల్లో తిరిగి లేదా.. రోడ్డు పక్కన విక్రయిస్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో.. గ్రామాల్లోని కూడళ్లలో అమ్ముతుంటారు. దీంతో రోజుకు రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. వీరికి సరైన వసతి కల్పిస్తే పన్ను చెల్లించడానికి వెనకాడరు. కానీ పంచాయతీలు ఆ దిశగా దృష్టి సారించకపోవడంతో.. ఆదాయ మార్గం కోల్పోతోతున్నాయి. యాచారం, మాల్‌తో పాటు.. చాలా ప్రాంతాల్లో నేటికీ కూరగాయల మార్కెట్లు లేవు. రోడ్లపైనే క్రయ, విక్రయాలు కొనసాగుతుంటాయి.

రోజు రొక్కంతోజీవన ప్రయాణం

తక్కువ పెట్ట్టుబడితో అధిక ఆదాయం

ఆర్థికంగా బలపడుతున్న చిరువ్యాపారులు

వ్యక్తిగత నమ్మకంతో బ్యాంకర్ల రుణాలు

చింతలేని జీవితం1
1/1

చింతలేని జీవితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement