
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
రంగారెడ్డి జిల్లా: హయత్‌నగర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్– 19 ఎస్‌జీఎఫ్ బాలుర కబడ్డీ విభాగంలో కందుకూరు (నిశిత క్యాంపస్) మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్స్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్) కళాశాల నుంచి పి.శ్రీనాథ్, కార్తీక్‌రెడ్డి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దీప, కళాశాల స్టాఫ్, పీడీ గణేశ్, పీఈటీ హనుమంత్ తదితరులు శుక్రవారం విద్యార్థులను అభినందించారు. రంగారెడ్డి జిల్లా నుంచి స్టేట్ లెవల్‌కు ఎంపికై న శ్రీనాథ్, కార్తీక్‌రెడ్డి మహబూబాద్‌లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక