
మహాసభలను జయప్రదం చేయండి
మీర్‌పేట: సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు దాసరి బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం పురపాలిక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తుర్కయంజాల్ పట్టణంలో ఈ నెల 14,15న నిర్వహించనున్న సభలో.. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని తెలిపారు. కావున కార్మికులు పెద్ద సంఖ్యలో రావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరిచారి, కమలమ్మ, లలిత, బావమ్మ, బుచ్చమ్మ, స్వరూప, పున్నమ్మ, శోభ, శ్రీకాంత్, సతీష్, సత్తయ్య పాల్గొన్నారు.