
తడి, పొడి చెత్త ఎక్కడ?
నందిగామ: ‘గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తను ఎక్కెడెక్కడ నిల్వ ఉంచారు. ఎంత మేర వర్మీ కంపోస్టు తయారు చేశారు’ అని డీపీఓ సురేష్ మోహన్.. రంగాపూర్ గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎంపీఓ తేజ్ సింగ్‌లను ప్రశ్నించారు. దీనికి వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాపూర్‌లో కంపోస్టు యార్డును శుక్రవారం డీపీఓ తనిఖీ చేశారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో సంబంధిత అధికారులైన గ్రామ కార్యదర్శి, ఎంపీఓపై మండిపడ్డారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, కంపోస్టు యార్డుకు తరలించాలని, పరిసరాలను పరిశుభ్రగా ఉంచాలని ఆదేశించారు. వారంలోపు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల బిజీ కారణంగా కొంత నిర్లక్ష్యం జరిగిందని, వారం రోజుల్లో కంపోస్టు యార్డుల్లో తడి పొడి చెత్తను వేర్వేరుగా వేసి, కంపోస్టును తయారు చేస్తామని ఎంపీఓ తేజ్ సింగ్.. డీపీఓకు వివరణ ఇచ్చారు.
● వర్మీ కంపోస్టు తయారీ ఎంత?
● గ్రామ అధికారులపైడీపీఓ సురేష్ మోహన్ ప్రశ్నల వర్షం