
తారామతిపేటలో మొసలి కలకలం
జూపార్క్‌కు తరలించిన ఫారెస్ట్ అధికారులు
అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని తారామతిపేటలో మొసలి కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయాన్నే పొలాలకు వెళ్తున్న రైతులకు ఊరి శివారులోని ఓ రేకుల షెడ్డు వద్ద మొసలి కనిపించడంతో స్థానికులకు సమాచారం అందించారు. దీంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో మూసీ నది కాలువ నీటిలో నుంచి గ్రామంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్, పోలీసు అధికారులకు చెప్పడంతో మొసలిని బంధించి నగరంలోని జూపార్క్‌కు తరలించారు. ఇది 12 అడుగుల పొడవు, 120 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.