
క్రీడాకారులకు ప్రోత్సాహం
షాబాద్: చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులను ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహిస్తోందని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఎంఆర్ ట్రస్ట్ సహకారంతో కొనసాగుతున్న 69వ మండలస్థాయి తెలంగాణ స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలు శుక్రవారంతో ముగిసాయి. బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వారికి నచ్చిన క్రీడను ఎంచుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యులు కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, మాజీ సర్పంచులు నర్సింలు, శ్రీనివాస్‌గౌడ్, మహేందర్‌గౌడ్, లింగం, నాయకులు సుభాష్‌రెడ్డి, రాహుల్, రఫీక్, సూర్య, శ్రీనివాస్, శేఖర్, మాధవ్ రెడ్డి, సాయి పాల్గొన్నారు.