
ముగిసిన జోనల్ స్థాయి కబడ్డీ పోటీలు
అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని బాటసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న హయతనగర్ జోనల్ స్థాయి 69వ కబడ్డీ టోర్నమెంట్ కం సెలక్షన్స్ శుక్రవారంతో ముగిశాయి. కార్యక్రమానికి హాజరైన హయతనగర్ జోనల్ సెక్రటరీ నిర్మల మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి అండర్–14, అండర్–17 బాలికలు, బాలురు మొత్తం 1,500 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు తెలిపారు. జోనల్ స్థాయిలో ఇంత పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం ఇదే మొదటిసారని అన్నారు. పోటీలు విజయవంతమయ్యేలా కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
విజేతలుగా వీరే..
● అండర్ –14 బాలికల విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్ పెద్దఅంబర్‌పేట, రన్నర్స్‌గా ఇంజాపూర్ జెడ్పీస్కూల్ జట్లు నిలిచాయి.
● అండర్ –14 బాలుర విభాగంలో హయత్‌నగర్ జెడ్పీ స్కూల్ జట్టు ప్రథఽమ, తారమతిపేట జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి.
● అండర్–17 బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో ఎంజీపీ హయత్‌నగర్ జట్టు, ద్వితీయ స్థానంలో తారమతిపేట జట్టు నిలిచాయి.
● అండర్–17 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో జెడ్పీహెచ్‌ఎస్ బాటసింగారం.. ద్వితీయ స్థానంలో న్యూ చైతన్య స్కూల్ జట్లు నిలిచాయి.