
పేద విద్యార్థులకు అండగా ఉంటాం
మణికొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు తమ వంతుగా అండగా ఉంటామని ఐడీబీఐ బ్యాంక్ ప్రాంతీయ కో ఆర్డినేటర్ కునాల్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ, నెక్నాంపూర్ ప్రాథమిక పాఠశాలకు బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులు రూ. 2 లక్షలతో కంప్యూటర్ టేబుల్‌లు, కుర్చీలు, క్లాస్ రూం రాక్‌లు, లైబ్రరీ రాక్‌లు, ఆఫీస్ టేబుల్‌లు, కుర్చీలను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్య అథితిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తమ బ్యాంక్ తరఫున ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలను కల్పించేందుకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అధనపు తరగతులను నిర్మించామన్నారు. మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ కె. నరేందర్ ముదిరాజ్, మాజీ వైస్ చైర్మన్ కె.నరేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ కె.రామకృష్ణారెడ్డి, బ్యాంక్ మేనేజర్ జయకుమార్, బ్యాంక్ రీజనల్ అధికారులు అఖిలేష్, జైసింగ్, ప్రధానోపాధ్యాయుడు మహ్మద్ అనీస్ తదితరులు పాల్గొన్నారు.
ఐడీబీఐ బ్యాంక్ ప్రాంతీయ కోఆర్డినేటర్ కునాల్