
ఫినాయిల్ బాటిల్‌లో నీరు తాగి..
షాద్‌నగర్‌రూరల్: ఫినాయిల్ బాటిల్‌లో నీరు పట్టుకుని తాగిన విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం గురుకుల హాస్టల్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి సమీపంలో వివేకానంద డిగ్రీ కళాశాల భవనంలో కేశంపేట జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కొనసాగుతోంది. ఫరూఖ్‌నగర్ మండలం చిల్కమర్రికి చెందిన హర్షవర్దన్ ఇక్కడ 10వ తరగతి చదువుతున్నాడు. గురువారం టిఫిన్ చేసిన విద్యార్థి తాగునీటి కోసం కులాయి వద్దకు వెళ్లాడు. కాగా అక్కడ వాడి పడేసిన ఫినాయిల్ బాటిల్ ఉంది. ఇది గమనించని విద్యార్థి అందులో వాటర్ పట్టుకుని తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే హాస్టల్ సిబ్బంది షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న హర్షవర్దన్‌ను పాఠశాల సిబ్బంది ఇంటికి పంపారు.
గురుకుల విద్యార్థికి అస్వస్థత