
సీపీఎం అభ్యర్థులను గెలిపించండి
యాచారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పిలుపునిచ్చారు. మాల్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల తరఫున నిత్యం పోరాటాలు చేసే సీపీఎం అభ్యర్థులను గెలిపిస్తే మేలు జరుగుతుందన్నారు. ఆరు గ్యారంటీ పథకాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యుడు అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పి.బ్రహ్మయ్య, జంగయ్య, చందునాయక్ తదితరులు పాల్గొన్నారు.