
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి
మీర్‌పేట: అహింసా, సత్యాగ్రహం ద్వారా బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో మహాత్మాగాంధీ కీలకపాత్ర పోషించారని టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చందన చెరువు కట్టపై గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు చల్లా బాల్‌రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, వెంకటేశ్‌గౌడ్, గజ్జెల రాంచందర్, ఓంప్రకాశ్, విజయవర్ధన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, పరశురాం పాల్గొన్నారు.
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి మునగనూర్‌లో నిర్మాణంలో ఉన్న వేంకటేశ్వర అభిషేక ఆనంద ఆలయం గర్భాలయం ప్రధాన ద్వారం ప్రతిష్ఠ కార్యక్రమానికి శుక్రవారం పీసీసీ చీఫ్ మహేశ్ మార్ గౌడ్ ఎమ్మెల్మే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన ద్వారం గడప పూజ, కల్యాణ మహోత్సవం, పూర్ణాహుతిని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పురపాలక సంఘం పరిధి మునగనూర్‌కు చెందిన డా.ఉదావత్ లచ్చిరాంకు భారత్ బ్రాండ్ బుక్ ఆఫ్ రికార్డ్ న్యూఢిల్లీ సీఈఓ డి.కె.రాజ్ శుక్రవారం ఆన్‌లైన్‌లో గ్లోబల్ పీస్ అవార్డ్–2025 అందజేశారు. ఈ సందర్భంగా లచ్చిరాం మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థులకు స్వాతంత్ర ఉద్యమం నాటి సంఘటనలు వివరించడం, కేంద్రం నిర్వహిస్తున్న క్విజ్ పోటీల్లో పాల్గొనేలా చేయడం, అహింసా మార్గాన్ని బోధించడంలో కృషి చేసినందుకు ఈ అవార్డు వరించిందని తెలిపారు.

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా కప్పాటి