
కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు
చేవెళ్ల: ఓ లారీ కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో క్యాబిన్ ముందుభాగంలో మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటన చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెన బస్‌స్టేజీ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. షాబాద్ నుంచి శుక్రవారం చేవెళ్ల మీదుగా కంటైనర్ లారీ ఎలక్ట్రికల్ పైపులతో ముంబైకి వెళ్తోంది. పామెన బస్‌స్టేజీ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమైన రోడ్డు పక్కన ఆపి కిందికి దిగారు. మంటలు క్యాబిన్ మొత్తం వ్యాపించాయి. స్థానికుల సాయంతో ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు.