
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి
కడ్తాల్: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని టాస్క్ సీఈఓ, ఐక్య ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని గోవిందాయిపల్లిలో దుర్గామాత మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామునాయక్, నాయకులు శేఖర్‌గౌడ్, ఎల్లాగౌడ్, శ్రీకాంత్, రాఘవేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.