
‘మర్యాద’ యాదన్న!
నవాబుపేట సమావేశంలోస్టేజీపై కుర్చీ కేటాయించిన బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయించకపోతే మీటింగ్‌లకు రావాలని పిలుపు స్పందించని కాలె
వికారాబాద్: అందరూ మర్యాద యాదయ్యగా పిలుచుకునే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇరకాటంలో పడ్డారు. బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హస్తం గూటిలో తలదాచుకున్న ఆయనకు స్థానిక ఎన్నికలతో పాటు పార్టీ ఫిరాయింపుల చట్టం ఇరకాటంలో పడేసింది. ఒకే సమయంలో స్పీకర్ నోటీసులు, విచారణ, స్థానిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడం లాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ఎప్పుడూ లేని వింత పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. మంగళవారం తన సొంత మండలం నవాబుపేటలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యే యాదయ్యను ఇరకాటంలో పెట్టేందుకు వాడుకున్నారు. స్టీజ్‌పై కుర్చి వేసి.. దానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య అని పేపరు అతికింది వేదికపైకి రావాలంటూ ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సొంత మండలం నుంచి..
సొంత మండలం నవాబుపేట నుంచి ఎంపీపీగా, జెడ్పీటీసీగా ఆ తర్వాత టీటీడీ బోర్డు సభ్యుడిగా కాలె యాదయ్య ఎదిగారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మొదటి సారి ఆ పార్టీ నుంచే ఎమ్మెలేగా గెలుపొందారు. రాష్ట్రం విడిపోవడం, ఆ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడంతో కారు పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీంఫారంతో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలు పొందిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హస్తం గూటికి చేరారు. ఒకరు తరువాత మరొకరు పార్టీని వీడుతుండటంతో కారు పార్టీ అలర్టయ్యింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయా లని కోర్టు గడప తొక్కిన విషయం తెలిసింది. చివరకు ఆ వివాదం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లడం, ఫిరాయింపు ఎమ్మెలేల విషయంలో ఏదో ఒక నిర్ణ యం తీసుకోవాలంటూ కోర్టు స్పీకర్‌కు సూచించింది. దీంతో ఇటీవల స్పీకర్ ట్రిబ్యునల్ ముందు ఎమ్మెల్యేలు హాజరై వివరణ ఇచ్చారు. వీరిలో కాలె యాయద్య కూడా ఉన్నారు. ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే చేవెళ్లలో మాట్లాడుతూ.. తాను పార్టీ మారలేదని, బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న బీఆర్‌ఎస్ ఇటీవల యాదయ్య సొంత మండలం నవాబుపేటలో జరిగిన సమావేశంలో ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చింది. పార్టీలో ఉంటే స్టేజ్‌పైకి వచ్చి కూర్చోవాలంటూ ఆయన పేరుతో ఓ కుర్చీ వేసి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి సబితారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ తదితరులు హాజరైన కార్యకర్తల సమావేశంలో కార్యక్రమం పూ ర్తయ్యే వరకు కుర్చీ స్టేజ్‌పై ఆలాగే ఉంచి యాద య్యను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.
ఇరకాటంలో చేవెళ్ల ఎమ్మెల్యే
కుమారుడికి జెడ్పీ పీఠం కోసం..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో యాదయ్య ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందగా, 2019లో జరిగినపరిషత్ ఎన్నికల్లో కుమారుడు మొయినాబాద్ జెడ్పీటీసీగా, కోడలు నవాబుపేట ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో మూడు పదవులు దక్కడంతో యాదయ్య కుటుంబం వార్తల్లోకెక్కింది. ఇదంతా బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిందే. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉండగా పాత సంప్రదాయాన్ని మళ్లీ కొనసాగించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మండలాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేయబడ్డాయి. ఇదే సమయంలో రంగారెడ్డి జెడ్పీ పీఠం కూడా అదే సామాజిక వర్గానికి రిజర్వ్ అయ్యింది. దీంతో చేవెళ్ల మండలం నుంచి కుమారుడిని జెడ్పీటీసీగా బరిలోకి దింపడం ద్వారా జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కుమారుడు కాలె శ్రీకాంత్ ఇటీవల చేవెళ్ల మండల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి కీలక సమయంలో ఎమ్మెల్యే యాదయ్యకు స్పీకర్ నోటీసులు ఇవ్వడం.. ఆయనకు పదవీ గండం పొంచి ఉండటం ఆ కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది.