
జాగృతి అధ్యక్షురాలికి స్వాగతం
కందుకూరు: విదేశాల్లో బతుకమ్మ మహోత్సవాలు పూర్తి చేసుకుని వచ్చిన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవితను బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో జాగృతి నాయకులు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లోనూ ప్రచారం చేస్తున్న కవితకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో జాగృతి నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్, బాబురావు, సభావత్ గణేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులు అభివృద్ధి సాధించాలి
ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌నాయక్
కడ్తాల్: గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎల్‌ఎచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్‌నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని గానుగుమార్ల తండాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం తండాలో నిరుద్యోగ యువకుడు ఏర్పాటు చేసిన వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు. యువత స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్ సేవ్యానాయక్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, లక్పతినాయక్, మోత్యానాయక్, శ్రీను, భీమన్, టిక్‌లాల్, రాజు, చందర్, లక్ష్మణ్, పవన్, శ్రీను, పవన్, పద్మ పాల్గొన్నారు.
రైలు ప్రమాదంలో
ఏఎస్‌ఐ దుర్మరణం
తాండూరు: విధులకు వెళ్లేందుకు రైలు ఎక్కుతున్న కర్ణాటక రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన ఏఎస్సై రైలు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన స్థానిక రైల్వే స్టేషన్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని చించోళి తాలూకా మర్పల్లికి చెందిన మారుతి(49) కల్బుర్గి జిల్లాలోని జేడీ హల్లి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. స్వగ్రామానికి వచ్చిన మారుతి తిరిగి విధులకు వెళ్లేందుకు తాండూరు రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. రైలులో కల్బుర్గి వెళ్లేందుకు యశ్వంత్‌పూర్ రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి రైలు కింద పడ్డారు. దీంతో మారుతి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం గమనించిన రైల్వే పోలీసులు వెంటనే అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కల్బుర్గి జిల్లాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతు బుధవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.

జాగృతి అధ్యక్షురాలికి స్వాగతం