
ఆటపాటలతో బతుకమ్మ సందడి
ఆమనగల్లు: తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అయిన బతుకమ్మ సంబురం బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తీరొక్క పూలతో పేర్చిన పూలగోపురాలను పట్టణంలోని హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. అనంతరం మహిళలు, యవతులు ఆటపాటలతో సందడి చేశారు. సురసముద్రం చెరువులో నిమజ్జనం చేశారు. వేడుకలకు మున్సిపాలిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో మున్సిపల్ కమిషనర్ శంకర్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్, ఉత్సవ కమిటీ సభ్యులు గుర్రం కేశవులు, కండె హరిప్రసాద్, దుర్గయ్య, నర్సింహ, అప్పం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఆటపాటలతో బతుకమ్మ సందడి