
స్థానిక పోరుకు సిద్ధం కండి
బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని లష్కర్‌గూడ గ్రామంలో మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంచిరెడ్డి హాజరై మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ కారు ్డగురించి వివరించారు. పార్టీ నాయకులు ఐక్యంగా పనిచేసి, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంరెడ్డి, జగదీశ్, చక్రవర్తిగౌడ్, వెంకట్‌రెడ్డి, ధనుంజయగౌడ్, కిరణ్‌కుమార్‌గౌడ్, సాయికుమార్‌గౌడ్, గౌరీశంకర్, రాధాకృష్ణ, రంగయ్య, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ
మండలంలోని ఇనాంగూడలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పిట్టల బాలశివుడు తండ్రి మాజీ ఉప సర్పంచ్ సత్తయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బాలశివుడిని మంగళవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.