పహాడీషరీఫ్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది ఉత్సవాలను మామిడిపల్లి గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చార్మినార్ బాగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సహ బౌద్దిక్ లాలూ యాదవ్ జీ మాట్లాడుతూ.. సంఘ్ కార్యకర్తలు ప్రతి పనిలోనూ దేశ ప్రయోజనలే పరమావధిగా భావిస్తారన్నారు. 1925 సంవత్సరంలో విజయదశమి రోజున ప్రారంభించిన ఆర్‌ఎస్‌ఎస్ హిందువులకు అన్ని రకాలుగా రక్షణగా ఉంటుందన్నారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో బస్తీ ప్రముఖ్ నందీశ్వర్, సతీష్‌గౌడ్, విశ్వనాథ్‌గౌడ్, విజయేందర్‌రెడ్డి, రంగనాథ్, పంచముఖి హనుమాన్ వ్యాయామ శాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.