
ఎన్నికలకు సిద్ధం కండి
కేంద్ర మంత్రి బండి సంజయ్
చేవెళ్ల: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీశ్రేణులు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. మంగళవారం మంగళవారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో పూజలకు హాజరైన బండి సంజయ్‌ను ఇటీవల బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన గణేశ్ కండెతో పార్టీ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రం మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో అధిక సీట్లను గెలుచుకునేలా పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. ఆయన్ను కలిసిన వారిలో చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు ఎ.అనంత్‌రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి
ఆమనగల్లు: ఐక్యత స్వచ్ఛంద సంస్థ సేవలను కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం ఆయన మేడిగడ్డ తండా ముత్యాలమ్మ ఆలయాభివృద్ధికి రూ.లక్ష చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యరక్రమంలో మాజీ సర్పంచ్ అంబర్‌సింగ్, మాజీ ఉపసర్పంచ్ మల్లేశ్‌నాయక్, ఆలయ పూజారి వినోద్‌కుమార్, నాయకులు రాంజ్యనాయక్, మల్లేశ్, తావు, మల్య, మణిపాల్, కిషన్‌నాయక్, శ్రీనునాయక్, కుబ్య, రాజు, దేవ్య, సీతారాం, రాజు తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో యూరియా
జిల్లా వ్యవసాయాధికారి ఉష
కొందుర్గు: రైతులు సాగుచేసిన పంటలను రైతు విస్తరణాధికారి వద్ద నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష సూచించారు. మంగళవారం ఆమె కొందుర్గు, రామచంద్రాపూర్ గ్రామాలను సందర్శించి రైతు ఆగ్రో కేంద్రం, మన గ్రోమోర్ సెంటర్, పీఏసీఎస్‌లలో రికార్డులను పరిశీలించారు. యూరియా స్టాకు, రైతులకు అందజేసిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం డీఏఓ ఉష మాట్లాడుతూ.. రైతుల అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులకు నాణ్యమైన పురుగుమందు విక్రయించాలని.. కొనుగోలు సమయంలో విధుగా రసీదు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు రాయితీపై ట్రాక్టర్ పనిముట్లు, స్ప్రేయర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైన రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జతచేసి సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారికి దరఖాస్తు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సురేశ్ రెడ్డి, ఏఈఓ వాసవి పాల్గొన్నారు.
ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా లలితాదేవి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా ఇన్‌చార్జి వైద్యాధి కారి డాక్టర్ లలితాదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన డాక్టర్ వెంకటేశ్వర్‌రావు రిటైర్డ్ అవ్వడంతో ఆయన స్థానంలో డాక్టర్ లలితాదేవికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తామన్నారు.

ఎన్నికలకు సిద్ధం కండి

ఎన్నికలకు సిద్ధం కండి

ఎన్నికలకు సిద్ధం కండి