
అంతర్రాష్ట్ర మద్యం పట్టివేత
పహాడీషరీఫ్: ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకొస్తున్న మద్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో పహాడీషరీఫ్‌లో దాడులు నిర్వహించి 41 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా, హరియాణ, ఢిల్లీ ప్రాంతాల నుంచి మద్యం బాటిళ్లను దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బాటిళ్లను సరూర్‌నగర్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ ఏరియాలో ఎస్టీఎఫ్ బీ అండ్ డీ టీమ్‌లు నిర్వహించిన దాడుల్లో 45 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్‌సీ టీమ్ సీఐ బిక్షారెడ్డి, డీ టీమ్ సిఐ నాగరాజులు చేపట్టిన ఈ వాహనాల తనిఖీలలో రెండు చోట్ల పట్టుబడిన మద్యం విలువ రూ.2.5 లక్షలుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.