
ఆలయ అభివృద్ధికి ఐక్యత తోడ్పాటు
ఆమనగల్లు: దేవాలయాల అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ తోడ్పాటునందిస్తుందని ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. మాడ్గుల మండలం కాట్రాంతండాలో నూతనంగా నిర్వహించిన తుల్జాభవానీ ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి.. ఆలయ నిర్వాహకులకు రూ.1 లక్ష విరాళంఅందజేసి మాట్లాడారు. ఈ ఆలయానికి గతంలో రూ.4 లక్షలు ఇచ్చానని, ప్రస్తుతం మరో లక్ష అందజేశానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాట్రావత్ హంసీ రాంలాల్, ఆలయ కమిటీ సభ్యులు అమర్‌సింగ్, రవీంద్ర, పవన్, నర్సింహ, దేవ్, రాములు, రాజ్‌కుమార్, హరి, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.