
ఉత్తమ లయన్స్‌క్లబ్‌గా ఆమనగల్లు
ఆమనగల్లు: లయన్స్‌క్లబ్ జిల్లా 320ఎ పరిధి క్లబ్‌లలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అత్యుత్తమ క్లబ్‌గా ఆమనగల్లు లయన్స్‌క్లబ్ నిలిచింది. అలాగే 2024– 25 ఏడాదికి క్లబ్ గత అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఉత్తమ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నగరంలోని ఓ కన్వెన్షన్‌హాలులో.. సోమ వారం జరిగిన కార్యక్రమంలో క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కోటేశ్వర్‌రావ్ అవార్డులు అందజేశారు. అలాగే వైద్య శిబిరాలకు, వీల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమానికి పర్మినెంట్ ప్రాజెక్ట్‌కు గాను అవార్డులు దక్కాయి. క్లబ్ జిల్లా గవర్నర్ మహేందర్ కుమార్‌రెడ్డి, ఇంటర్నేషనల్ డైరెక్టర్ సునీల్‌కుమార్, వైస్ గవర్నర్లు సురేశ్ జిఘ్నాని, శశికాంత్, మాజీ గవర్నర్ చెన్నకిషన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, జోన్‌చైర్మన్ లింగయ్య, జిల్లా చైర్మన్ రమేశ్, క్లబ్ సభ్యులు నర్సింహ, సత్యం, పీఆర్‌ఓ పాషా పాల్గొన్నారు.